అగ్రి కోర్సులతో అందలం.. కొలువులకు కొదవేలేదు | ICAR Entrance Examinations 2021 | Sakshi
Sakshi News home page

ICAR Entrance Examinations-2021: అగ్రి కోర్సులతో అందలం!

Published Mon, Aug 16 2021 8:04 PM | Last Updated on Mon, Aug 16 2021 8:16 PM

ICAR Entrance Examinations 2021 - Sakshi

ద ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌.. సంక్షిప్తంగా ఐసీఏఆర్‌! ఐకార్‌గా సుపరిచితం. ఇది జాతీయ స్థాయిలో అగ్రికల్చర్, అనుబంధ కోర్సుల బోధనలో.. ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌! ఈ సంస్థ పరిధిలోని యూనివర్సిటీలు, కళాశాలలు అందించే అగ్రికల్చర్‌ కోర్సులు పూర్తి చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఖాయం! వీటిల్లో చేరేందుకు మార్గం..ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ!! నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రతి ఏటా నిర్వహించే.. ఐసీఏఆర్‌–ఏఐఈఈఏకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ–2021 వివరాలు, కోర్సులు, ప్రవేశ పరీక్ష విధానం, అర్హతలు, భవిష్యత్తు అవకాశాలపై ప్రత్యేక కథనం... 

అగ్రికల్చరల్‌ కోర్సులు. వీటికి ఎవర్‌ గ్రీన్‌ కోర్సు లుగా పేరు. ఎందుకంటే.. వ్యవసాయ ప్రధానమైన భారత్‌లో అగ్రి కోర్సులు పూర్తి చేసిన వారికి కొలువులకు కొదవలేదు. అందుకే జాతీయ స్థాయిలోని అగ్రికల్చర్‌ యూనివర్సిటీల్లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే.. ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ(ఐసీఏఆర్‌ ఆల్‌ ఇండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ అడ్మిషన్‌)కు ఎంతో పోటీ నెలకొంది. మరోవైపు రాష్ట్ర స్థాయిలో టీఎస్‌ ఎంసెట్‌(బైపీసీ)/ఏపీ ఈఏపీసెట్‌(బైపీసీ)లో ర్యాం కు సాధించి..అగ్రికల్చర్‌ యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది!

74 అగ్రి యూనివర్సిటీలు
ఐకార్‌ పరిధిలో మొత్తం 74 అగ్రికల్చర్‌ యూనివర్సి టీలు ఉన్నాయి. వీటిల్లో  63 స్టేట్‌ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్‌ యూనివర్సిటీలు; 4 ఐకార్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలు(ఐఏఆర్‌ఐ, ఐవీ ఆర్‌ఐ, ఎన్‌డీఆర్‌ఐ, సీఐఎఫ్‌ఈ); మూడు సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలు(సీఏయూ ఇంఫాల్, డాక్టర్‌ ఆర్‌పీసీయూ, పుసా, ఆర్‌ఎల్‌బీ సీఏయూ, ఝాన్సీ); 4 సెంట్రల్‌ యూనివర్సిటీలు (బీహెచ్‌ యూ, ఏఎంయూ, విశ్వభారతి, నాగాలాండ్‌ యూనివర్సిటీ) ఉన్నాయి. 

ఆల్‌ ఇండియా కోటా
ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ ద్వారా ఐసీఏఆర్‌ అనుబంధ ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీల్లో వ్యవసాయ విద్య కోర్సుల్లో ఆల్‌ ఇండియా కోటా ప్రవేశాలు లభిస్తాయి. అంటే.. ఈ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో మంచి స్కోర్‌ సాధిస్తే.. విద్యార్థులు జాతీయ స్థాయిలోని అన్ని అగ్రికల్చర్‌ యూనివర్సిటీల్లో ఆల్‌ ఇండియా కోటా సీట్లకు పోటీ పడొచ్చు. అదే విధంగా రాష్ట్ర స్థాయి వ్యవసాయ యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా ప్రవేశ విధానాలు అనుసరిస్తున్నాయి.

మూడు స్థాయిల కోర్సులు
ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ ద్వారా వ్యవసాయ, అనుబంధ కోర్సుల్లో మూడు స్థాయిల్లో ఆల్‌ ఇండియా కోటా ప్రవేశాలు జరుగుతాయి. ఒక్కోస్థాయి కోర్సుకు నిర్దిష్ట శాతంతో ఆల్‌ ఇండియా కోటాను నిర్ణయించారు. 
► ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ(యూజీ):వ్యవసాయ, అను బంధ కోర్సుల్లో జాతీయ స్థాయిలోని వర్సి టీల్లో ఆల్‌ ఇండియా కోటా పేరుతో 15 శాతం సీట్లను ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ (యూజీ) ఎంట్ర న్స్‌లో ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తున్నారు. ఈ విధానంలో సీట్లు పొందిన విద్యా ర్థులకు నేషనల్‌ టాలెంట్‌ స్కాలర్‌షిప్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ అండ్‌ అల్లైడ్‌ సైన్స్‌ సబ్జెక్ట్స్‌ పేరుతో నెలకు రూ.మూడు వేల ఉపకార వేతనం కూడా అందుతుంది.

► ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ(పీజీ): ఈ ఎంట్రన్స్‌ ద్వా రా  దేశంలోని అన్ని అగ్రికల్చర్‌ యూనివర్సి టీల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి వ్యవసాయ కోర్సుల్లో.. 25 శాతం సీట్లను భర్తీ చేస్తారు. ఈ ఎంట్రన్స్‌లో టాప్‌–600(మొదటి ఆరు వందల మంది) జాబితాలో నిలిచి.. ఐకార్‌ అనుబంధ అగ్రికల్చర్‌ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారికి ఐసీఏఆర్‌–పీజీ స్కాలర్‌షిప్‌ పేరిట నెలకు రూ.12,460 చొప్పున రెండేళ్ల పాటు ఉపకార వేతనం లభిస్తుంది. ఆరు వందలకు పైగా ర్యాం కు సాధించిన విద్యార్థులకు నేషనల్‌ టాలెంట్‌ స్కాలర్‌షిప్‌(పీజీ) పేరిట నెలకు రూ.5వేలు చొప్పున రెండేళ్ల పాటు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తారు. 
► ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ(పీహెచ్‌డీ):ఐసీఏఆర్‌ అను బంధ సంస్థల్లో ఆల్‌ ఇండియా కోటాలో.. పీహెచ్‌డీ(డాక్టోరల్‌) ప్రోగ్రామ్‌లలో 25 శాతం సీట్ల భర్తీకి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఎంట్రన్స్‌ ద్వారా ప్రవేశం ఖరారు చేసుకున్న వారికి జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌ పేరుతో ఫెలోషిప్‌ అందిస్తారు. మొదటి రెండేళ్లు నెలకు రూ.31 వేలు చొప్పున జేఆర్‌ఎఫ్‌ను, మూడో ఏడాది ఎస్‌ఆర్‌ఎఫ్‌ పేరుతో నెలకు రూ.35 వేలను ఫెలోషిప్‌గా అందిస్తారు. దీనికి అదనంగా ప్రతి ఏటా రూ.పది వేలు చొప్పున కాంటింజెంట్‌ గ్రాంట్‌ను కూడా ఇస్తారు.

మూడింటికీ.. వేర్వేరు పరీక్షలు
ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ విధానంలో బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు మూడింటికీ వేర్వేరుగా ఎంట్రన్స్‌ టెస్టులు నిర్వహిస్తారు.

బ్యాచిలర్‌ స్థాయి కోర్సులు
ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ యూజీ ద్వారా ప్రస్తుతం బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో 11 కోర్సుల్లో ప్రవేశం లభి స్తుంది. అవి.. బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌; బీఎస్సీ ఆనర్స్‌ హార్టికల్చర్‌; బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్, బీఎస్సీ(ఆనర్స్‌) ఫారెస్ట్రీ; కమ్యూనిటీ సైన్స్‌; ఫుడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటిటిక్స్‌; బీఎస్సీ(ఆనర్స్‌) సెరి కల్చర్‌; బీటెక్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ, బీటెక్‌ బయోటెక్నాలజీ.
► అర్హత: కోర్సులను అనుసరించి 10+2/ ఇంట ర్మీడియెట్‌ ఉత్తీర్ణత ఉండాలి. వయసు 31.08.2021 నాటికి 16ఏళ్లు నిండి ఉండాలి. 
►  పరీక్ష 150 ప్రశ్నలు–600 మార్కులకు నిర్వహి స్తారు. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ప్రతి సరైన సమాధానానికి 4మార్కులు లభిస్తాయి. ప్రతి పొరపాటు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. 
► ఇంటర్మీడియెట్‌ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌ల ఆధారంగా ఈ మూడు విభాగాల సబ్జెక్ట్‌లు ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న వివరాల ఆధారంగా ఈ మూడు విభాగాల నుంచే ప్రశ్నలు అడుగుతారు. 

పీజీ కోర్సులు ఇవే
ప్రస్తుతం పీజీ స్థాయిలో.. ప్లాంట్‌ బయోటెక్నాలజీ, ప్లాంట్‌ సైన్స్, ఫిజికల్‌ సైన్స్, యానిమల్‌ బయో టెక్నాలజీ, అగ్రి–బిజినెస్‌ మేనేజ్‌మెంట్, స్టాటిస్టికల్‌ సైన్స్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ/ఆగ్రో ఫారెస్ట్రీ అండ్‌ సివి కల్చర్, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, వాటర్‌ సైన్స్‌ టెక్నాలజీ, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, ఆగ్రోనమీ, ఫిషరీస్‌ సైన్స్, డెయిరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ, హోంసైన్స్, సోషల్‌ సైన్స్‌ తదితర విభాగాల్లో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

 అర్హత: 10+6 విధానంలో బీఎస్సీ అగ్రి కల్చర్‌/10+2+5 లేదా 10+2+5 1/2 విధానంలో(బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌)/డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం మార్కులు సాధించి ఉంటే సరిపోతుంది. 
► ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ(పీజీ) పరీక్ష: ఐసీఏఆర్‌ పీజీ పరీక్ష మొత్తం 120 ప్రశ్నలకుగాను 480 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు ఉంటుంది. 

పీహెచ్‌డీ పరీక్ష విధానం
► క్రాప్‌సైన్స్, హార్టికల్చర్, వెటర్నరీ అండ్‌ యాని మల్‌ సైన్స్‌–1, డెయిరీసైన్స్, డెయిరీ టెక్నాలజీ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీ, హోంసైన్స్, అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్, అగ్రికల్చరల్‌ స్టాటిస్టిక్స్, అగ్రి కల్చరల్‌ ఎకానమీ అండ్‌ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్, నేచురల్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, ఫిషరీ సైన్స్‌ సబ్జెక్ట్‌లలో మొత్తం 73 విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు.

► అర్హత: అభ్యర్థులు పీహెచ్‌డీలో ఎంపిక చేసుకు న్న విభాగానికి సంబంధించి పీజీ స్థాయిలో ఆ సబ్జెక్ట్‌ స్పెషలైజేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. 
► ఐసీఏఆర్‌–జేఆర్‌ఎఫ్‌/ఎస్‌ఆర్‌ఎఫ్‌(పీహెచ్‌డీ) పరీక్ష మొత్తం 120 ప్రశ్నలకుగాను 480 మార్కు లకు జరుగుతుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు ఉంటుంది.

సీట్ల కేటాయింపు
మూడు స్థాయిల కోర్సులకు సంబంధించి అభ్యర్థులు ఆయా ఎంట్రన్స్‌ల్లో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందించి.. ఆన్‌లైన్‌లో సీట్ల కేటాయింపు చేస్తారు. బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో 2,865 సీట్లు, పీజీ స్థాయిలో 3,219 సీట్లు, పీహెచ్‌డీ స్థాయిలో 1,377 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

► ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ 2021 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 
► ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో.. యూజీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయి అగ్రి కోర్సులు
►  ఆల్‌ ఇండియా కోటాలో ఐసీఏఆర్‌ అనుబంధ యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో అడ్మిషన్స్‌

ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ(యూజీ) ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021.
► దరఖాస్తుల సవరణ: ఆగస్ట్‌ 23–ఆగస్ట్‌ 26.
► పరీక్ష తేదీలు: సెప్టెంబర్‌ 7, 8, 13.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌.
► పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:  https://icar.nta.ac.in

ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ(పీజీ),(పీహెచ్‌డీ) ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021
► దరఖాస్తుల సవరణ: ఆగస్ట్‌ 23–ఆగస్ట్‌ 26
► పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 17,2021

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:  తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్‌.
► వివరాలకు వెబ్‌సైట్‌:  https://icar.nta.ac.in

ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ.. ముఖ్యాంశాలు
► ఐసీఏఆర్‌ అనుబంధ ఇన్‌స్టిట్యూట్‌లలో ఆల్‌ ఇండియా కోటా సీట్ల భర్తీ.
► ప్రస్తుతం జాతీయ స్థాయిలో 74 యూనివర్సిటీలు, నాలుగు ఐసీఏఆర్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలు, మూడు సెంట్రల్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలు, నాలుగు సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాలు.
► ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా అగ్రి యూనివర్సిటీస్‌ల్లో అడ్మిషన్స్‌.
► కోర్సులు పూర్తి చేసుకున్నాక ప్రభుత్వ, ప్రైవేట్‌ విభాగాల్లో అవకాశాలు.
►  కోర్సు చదివే సమయంలో స్కాలర్‌షిప్‌ సదుపాయం లభిస్తుంది.

డిమాండ్‌ పెరుగుతోంది
వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నైపుణ్యం ఉన్న మానవ వనరులకు డిమాండ్‌ పెరుగుతోంది. వ్యవసాయ విద్యను అభ్యసించిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో వ్యవసాయ పంటల అమ్మకాలు, మార్కెటింగ్, రవాణా, సేవ లు, నిల్వ, గిడ్డంగులు మొదలైన వాటిల్లో ఉద్యో గాలు లభిస్తున్నాయి. వ్యవసాయశాఖలోనూ అవకాశాలు దక్కించుకోవచ్చు. అగ్రికల్చ ర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్స్, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్స్‌ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.

అదే విధంగా ప్లాంటేషన్స్, ఫెర్టిలైజర్‌ కంపెనీలు, అగ్రికల్చరల్‌ మెషినరీలు, అగ్రికల్చరల్‌ ప్రొడక్ట్, ఫుడ్‌ ప్రాసె సింగ్‌ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. వీటితోపాటు ఎఫ్‌సీఐ, నాబార్డ్‌తోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూరల్‌ బ్యాంకింగ్‌ విభాగా ల్లోనూ ఆఫీసర్లు, మేనేజర్లుగా కెరీర్స్‌ సొంతం చేసుకోవచ్చు. పీహెచ్‌డీ పూర్తి చేస్తే.. ఐసీఏఆర్, ఐఏఆర్‌ఐ వంటి అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ కేంద్రా లతోపాటు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలోని రీసెర్చ్‌ కేంద్రాల్లో సైంటిస్ట్‌ హోదాలో స్థిరపడొచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement