
ప్రతినెలా ఒకటో తారీఖున వేకువజామునే పింఛన్ సొమ్ములు అందుతున్నాయి.. ఇది ఓ అవ్వ మాట ఏటా రైతు భరోసా సాయం బ్యాంకు ఖాతాలో జమవుతోంది.. ఇది ఓ రైతన్న ఆనందం మా పిల్లల చదువులకు అమ్మఒడి, విద్యా, వసతి దీవెనలతో ఆదుకుంటున్నారు.. ఇది ఓ తల్లి సంతోషం.. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అన్నివర్గాల ప్రజలూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నీరా‘జనాలు’ పడుతున్నారు. తమ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న సంక్షేమ ప్రదాతకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
●
చాలా మేలు చేశారు
మా కుటుంబం అంతా కూలీ, నాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నాం. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు మావి. ముఖ్యమంత్రిగా జగన్ పదవి చేపట్టిన తర్వాత అన్నివిధాలా ఆదుకున్నారు. ఆసరా, రైతు భరోసా తదితర పథకాల ద్వారా మా కుటుంబానికి సుమారు రూ.2,08,000 వరకు సాయం అందింది. వైఎస్సార్ చేయూత పథకంలో వచ్చిన సొమ్ములతో కిరాణా కొట్టు పెట్టుకుని బతుకుతున్నాం. నెలకు రూ.6 వేల వరకూ ఆదాయం వస్తోంది.
– కొనుతుల సావిత్రి, కొనుతుల ముత్యాలమ్మ, కొమ్ముగూడెం, బుట్టాయగూడెం మండలం
మళ్లీ జగనన్నే సీఎం
ప్రభుత్వ పథకాలు మా కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు నిస్తున్నాయి. డ్వాక్రా రుణమాఫీ సొమ్ము అందింది. చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పున మూడేళ్లుగా పొందుతున్నా. మా కోడలు వలంటీర్‌గా చేస్తోంది. ఆమెకూ డ్వాక్రా రుణమాఫీ అందింది. అర్హులందరికీ పథకాలు అందిస్తున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. మళ్లీ జగనన్నే సీఎం కావాలని, ఆయన ద్వారానే మా భవిష్యత్ బాగుంటుందనే విశ్వాసం ఉంది.
– కటికతల నాగమణి, మాదివాడ, ఆకివీడు
● ‘జగనన్నే మా భవిష్యత్’కి అనూహ్య స్పందన
● ప్రజాప్రతినిధులకు సాదర స్వాగతం
● సంక్షేమ పథకాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు
● ఉమ్మడి జిల్లాలో సందడిగా కార్యక్రమం
20వ తేదీ వరకు..
రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జగనన్నే మా భవిష్యత్తు పేరుతో 1.60 కోట్ల కుటుంబాలను కలిసి గత పాలన, ప్రస్తుత పాలనకు తేడాలు వివరిస్తూ ప్రభుత్వ పాలనపై ప్రజల సంతృప్తిని తెలుసుకునేలా కార్యక్రమం చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఈనెల 20వ తేదీ వరకూ కార్యక్రమం నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment