13 గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు బాలిక
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం పట్టణంలో మైనర్ బాలిక అదృశ్యం కేసును టూటౌన్ పోలీసులు 13 గంటల్లో ఛేదించారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ జయసూర్య శనివారం వివరాలు వెల్లడించారు. భీమవరం 36 వార్డు సత్యవతి నగర్‌కు చెందిన మజ్జి శ్రీను దంపతుల కుమార్తె ఈ నెల 6న మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి రాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని కేసును ఛేదించారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ నుంచి బాలిక అదృశ్యం అయినట్లు గుర్తించారు. రైల్వే పోలీసుల సహకారంతో బాలిక విజయవాడ వెళ్లినట్లుగా గుర్తించి అక్కడ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. బాలిక ఫొటోలు పంపించగా నిర్ధారణ చేసుకుని విజయవాడ హోంలో బాలికను ఉంచారు. ఆ తర్వాత బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రులు కోప్పడడంతో వెళ్లిపోయినట్లు విచారణలో తెలిందన్నారు.
రూ.5 లక్షల యానాం మద్యం స్వాధీనం
తణుకు అర్బన్: ఇతర రాష్ట్రాల మద్యం స్థానికంగా సరఫరా చేస్తున్న పాత నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 43.1 లీటర్ల మద్యం సీసాలు, కారును తణుకు ఎకై ్సజ్ శాఖ అధికారులు స్వాఽధీనం చేసుకున్నారు. ఇరగవరం మండలం కంతేరు గ్రామానికి చెందిన కొవ్వూరి వెంకట శ్రీనివాసరెడ్డి కదలికలపై నిఘా పెట్టిన అధికారులు శనివారం కంతేరులో కారులో ఉన్న యానాం మద్యం 209 సీసాలు, 10 టిన్ బీరులు స్వాధీనం చేసుకుని అతనిని అరెస్టుచేశారు. తణుకు ఎకై ్సజ్ స్టేషన్‌లో శనివారం జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి ఆర్‌ఎస్ కుమరేశ్వరన్ వివరాలు వెల్లడిస్తూ... ముద్దాయి యానాం, గోవా ప్రాంతాల నుంచి మద్యం సీసాలను తీసుకొచ్చి స్థానికంగా డోర్ డెలివరీ చేసేవాడని చెప్పారు. గతంలో తాడేపల్లిగూడెం, భీమడోలు, దేవరపల్లి కేసుల్లో పరారీలో ఉన్నాడని తెలిపారు. సహ నిందితుడిగా కోనాల వెంకట సత్యనారాయణరెడ్డి అలియాస్ భరత్‌రెడ్డి, చిన్ని అనే వ్యక్తితోపాటు యానాంలో మద్యం సరఫరా చేస్తున్న బాదర్ల ప్రేమ్‌కుమార్‌ను గుర్తించామని త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న మద్యం ధర సుమారుగా రూ. 5 లక్షలు ఉంటుందని చెప్పారు.
13 గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు బాలిక
Comments
Please login to add a commentAdd a comment