పాపికొండల్లో వన్యప్రాణుల సందడి
స్వేచ్ఛగా తిరుగుతున్న వన్య ప్రాణులు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 2020 నాటికి పోలవరం మండలం పరిధిలోని 19 నిర్వాసిత గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఆయా గ్రామాలు ఖాళీగా ఉండటంతో పాటు వ్యవసాయ భూముల్లో పశుగ్రాసం విపరీతంగా పెరిగింది. ఆ గ్రామాల పక్కన గోదావరి నది ఉండడంతో వన్యప్రాణుల సంచారం పెరిగింది. కొండ గొర్రెలు, నెమళ్లు, చిరుత పులులు, దుప్పులు, తదితర జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇటీవల వైల్డ్‌లైఫ్ అధికారులు కొరుటూరు సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పలు జంతువులు చిక్కాయి. వాటి సంరక్షణకు కూడా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అటువైపు వచ్చే పర్యాటకులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ట్రాప్ కెమెరాకు చిక్కిన చిరుత
బుట్టాయగూడెం: జీవ వైవిద్యానికి నిలయం పాపికొండల అభయారణ్యం. ఈ అభయారణ్యం పులులు, చిరుతలు, జింకలు, అడవి దున్నలతో కళకళలాడుతోంది. ఇటీవల కాలంలో అడవి జంతువుల సంఖ్య పెరగడం శుభపరిణామమని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇటీవల వైల్డ్‌లైఫ్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో అనేక జంతువులు స్వేచ్ఛగా తిరుగుతూ కెమెరాకు చిక్కాయి. వాటి సంరక్షణకు వైల్డ్‌లైఫ్, ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
1.12 లక్షల హెక్టార్లలో అభయారణ్యం
1,12,500 హెక్టార్లలో పాపికొండల అభయారణ్యం విస్తరించి ఉంది. పశ్చిమ ఏజెన్సీప్రాంతంలో పాపికొండల అభయారణ్యం పరిధిలో ఉన్న బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అటవీప్రాంతంలో వన్య ప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. వైల్డ్‌లైఫ్ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జంతువుల కదలికలు గుర్తిస్తున్నారు. జంతువుల సంరక్షణ కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పాపికొండల అభయారణ్యంలో ఎలుగుబంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండచిలువలు, అడవి పందులు, అడవి దున్నలు, ఆగలి, గెద్దలు, నెమళ్లు, చిరుతలు, కురుడు పందులు, చుక్కల దుప్పులు, సాంబాలు, ముళ్ల పందులు, నక్కలు, ముంగిసలు, అడవి దున్నలు వంటివి ఉన్నాయి.
మూడేళ్ల క్రితం జంతు గణన
2018లో పాపికొండల అభయారణ్యంలో వైల్డ్ లైఫ్ అధికారులు జంతుగణన నిర్వహించి జంతువుల కదలికలను గుర్తించారు. 2022 జనవరిలో జంతుగణన కార్యక్రమాన్ని చేపట్టారు. పాపికొండల అభయారణ్యంలోని సుమారు 116 ప్రాంతాల్లో 232 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించారు. ఈ సర్వేల్లో ఏనుగులు, సింహాలు తప్ప అన్ని రకాల జంతువులు, పక్షులు, ఉభయచర జీవులను గుర్తించారు. జంతువుల సంరక్షణపై బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి వైల్డ్ లైఫ్ అధికారులు ప్రత్యేక గస్తీ నిర్వహించడంతోపాటు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాట్లు చేశారు.
పులి, చిరుతలు, జింకలు, దుప్పుల సంచారం
పెరిగిన నెమళ్లు, అడవి పందుల సంఖ్య
వేసవిలో దాహార్తి తీర్చేలా ఏర్పాట్లు
పాపికొండల్లో వన్యప్రాణుల సందడి
పాపికొండల్లో వన్యప్రాణుల సందడి
పాపికొండల్లో వన్యప్రాణుల సందడి
పాపికొండల్లో వన్యప్రాణుల సందడి
పాపికొండల్లో వన్యప్రాణుల సందడి
పాపికొండల్లో వన్యప్రాణుల సందడి
పాపికొండల్లో వన్యప్రాణుల సందడి
Comments
Please login to add a commentAdd a comment