చినవెంకన్న క్షేత్రంలో పోటెత్తిన భక్తులు
ద్వారకాతిరుమల : చినవెంకన్న దివ్య క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. ఎటుచూసినా భక్తులతో కళకళలాడాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల తదితర విభాగాలు భక్తులతో రద్దీగా మారాయి. ఉచిత అన్నప్రసాదం కోసం వకుళమాత నిత్యాన్నదాన భవనం వద్ద భక్తులు బారులు తీరారు. పార్కింగ్ ప్రదేశాలు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. శ్రీహరి కళాతోరణం ప్రాంతంలో పలువురు బాలలు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి.
సాయంకాలార్చన సమయంలో మార్పు
శ్రీవారి ఆలయంలో ఈ నెల 14 నుంచి స్వామివారి సాయంకాలార్చన సమయాన్ని మార్పు చేస్తున్నట్టు ఆలయ ఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు నిర్వహిస్తున్నారని.. ఈ నెల 14 నుంచి సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహిస్తారని ఈఓ తెలిపారు. అర్చన జరిగే సమయంలో స్వామి దర్శనం ఉండదని, అర్చన ముగిసన తరువాత రాత్రి 7 గంటల నుంచి తిరిగి శ్రీవారి దర్శన భాగ్యం భక్తులకు కలుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment