రిటైర్డ్ జడ్జికి సత్కారం
ఉండి: రిటైర్డ్ జడ్జి పెరికల గంగయ్యను ఆదివారం వినియోగదారుల సంఘ నాయకుడు బొబ్బిలి బంగారయ్య, పలువురు భక్తులు సత్కరించారు. గ్రామంలో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించడమే కాకుండా గుడి పోషణార్థం తనకున్న ఏడెకరాల భూమిని గుడికి దానం చేశారు. స్వామి కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని నాయకులు, పలువురు భక్తులు సన్మానం చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ వేణుగోపాల్ దంపతులు, త్రిమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
కుక్కునూరు: కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పొదళ్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు పడ్డారు. శనివారం రాత్రి మండలంలోని కివ్వాక చెరువు కట్టపై ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కుక్కునూరు నుంచి కివ్వాక వైపు వెళ్తున్న కారు కివ్వాక చెరువు కట్ట మీదకు రాగానే రోడ్డు బాగోలేని కారణంగా అదుపు తప్పి పక్కనే ఉన్న పొదళ్లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు. వారిలో ఒకరికి తీవ్రగాయాలు కావడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment