50కి పైగా దేశాల డేటాతో..
నా వద్ద ఉన్న తక్కువ స్థాయి సామర్థ్యం గల పరికరాలతో అంచనాలను రూపొందిస్తున్నా. భవిష్యత్‌లో మరింత పరిధి పెంచుకోవటానికి ప్రయత్నించి, మెరుగ్గా అంచనా విధానాన్ని సిద్ధం చేస్తున్నా. దీంతో 50కి పైగా దేశాల భూకంపాల రీసెర్చ్ డేటాను పరిశీలించి ఆయా దేశాలకు సమాచారం పంపే అవకాశం ఉంటుంది. దీనిని కొన్నేళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆవిష్కరిస్తాను. భారత వాతావరణ శాఖ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భూకంపాలను ముందుగా అంచనాలు వేసే వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. దానికనుగుణంగా నా ప్రాజెక్టు సాగుతుంది.
– మరడాని శివ సీతారామ్, ఇంజనీర్, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment