ఉండి: రెండు రోజుల్లో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం కావడంతో ఉండిలో కలకలం చోటుచేసుకుంది. ఆదివారం ఉండి శివారు గోరింతోట వద్ద పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కాగా సోమవారం ఉండి ఇరిగేషన్ కార్యాలయం పక్కనే బొండాడ మేజర్ డ్రెయిన్‌లో మరో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఇద్దరి వయసు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, చనిపోయి సుమారు వారం రోజుల లోపు ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే మండలంలో ఇంతవరకు గత వారంగా ఎటువంటి అద్యశ్య కేసులు నమోదు కాలేదు. దీంతో చనిపోయినవారు ఇతర ప్రాంతాలకు చెందిన వారుగా భావిస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోను ఆక్వా చెరువులపై పనిచేసేందుకు ఇతర రాష్ట్రాలకు చెందినవారు వస్తుండడంతో ఎవరు మిస్సింగ్ అయినా పోలీసులకు ఫిర్యాదులు అందడం లేదు. దీంతో శవాలు గుర్తు తెలియని మృతదేహాలుగానే మిగిలిపోతున్నాయి. వీటిపై సరైన విచారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment