
చింతకాయల సత్యనారాయణకు గౌరవ పురస్కారం
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెంకు చెందిన ప్రముఖ వ్యాయమ ఉపాధ్యాయుడు చింతకాయల సత్యనారాయణ (పీడీ) గౌరవ పురస్కారం అందుకున్నారు. డెహ్రాడూన్ రాణా ప్రతాప్ సింగ్ స్టేడియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత పరుగుల రాణి, ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పెదపుల్లకాండి తక్కె పెరంబుల్ ఉష, పీటీ ఉషచే గౌరవ పురస్కారం అందుకున్నారు, అథ్లెటిక్స్‌లో క్రీడాకారులను రాణించేలా తీర్చిదిద్దినందుకుగాను ఆయనకు ఈ పురస్కారం లభించింది. క్రీడాకారులు, పీఈటీలు, పట్టణ ప్రముఖులు ఆయన్ను అభినందించారు.
ఆచంటేశ్వరుని హుండీ లెక్కింపు
పెనుగొండ: ఆచంటేశ్వరునికి రూ.4,88,159 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాఽధికారి ఆదిమూలం వెంకట సత్యనారాయణ తెలిపారు. సోమవారం దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వర్దినీడి వెంకటేశ్వరరావు సమక్షంలో హుండీ లెక్కించినట్లు వివరించారు. అదేవిధంగా శివరాత్రి సందర్భంగా టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.3,11,351 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. లెక్కింపులో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ నెక్కంటి గణేశ్వరరావు, ఆలయ అధికారులు గుబ్బల రామ పెద్దింట్లురావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని తెలిపారు.
లైన్‌గోపాలపురంలో బైక్ చోరీ
ద్వారకాతిరుమల: మండలంలోని లైన్‌గోపాలపురం జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ కింద సోమవారం పార్క్ చేసిన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితుడి కథనం ప్రకారం. మండలంలోని పి.కన్నాపురం గ్రామానికి చెందిన కొండేటి ఆనందరావు కొబ్బరి బొండాలు కోసే పని చేస్తుంటాడు. ఈ క్రమంలో రోజువలె ముఠా సభ్యులతో కలసి బైక్‌పై లైన్‌గోపాలపురంనకు వచ్చిన ఆనందరావు అందరితో పాటు తన బండిని ఫ్లై ఓవర్ కింద పార్క్ చేశాడు. అనంతరం కొంబరి బొండాలు కోసేందుకు వ్యాన్‌లో వెళ్లాడు. తిరిగి సాయంత్రం వచ్చేసరికి బైక్ కనిపించలేదు. చుట్టుపక్కల వెదికినా ఫలితం దక్కలేదు. దాంతో బైక్ చోరీకి గురైనట్టు గుర్తించిన బాధితుడు ఆనందరావు ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

చింతకాయల సత్యనారాయణకు గౌరవ పురస్కారం
Comments
Please login to add a commentAdd a comment