
● బాల్య వివాహాలు నేరం
బాల్య వివాహాలను అరికట్టాలని కోరుతూ సోమవారం సాయంత్రం బుట్టాయగూడెం మండలం రాజానగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎన్‌వీ సత్యవతి మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. వసతిగృహం వార్డెన్ బి. సోమాలమ్మ, ఏఎన్‌ఎం ఎం.సూర్యకాంతం, అంగన్‌వాడీ కార్యకర్తలు కె. పుష్ప, పి.సుజాత, కె.అనంతకుమారి, వి.దుర్గాలక్ష్మి, కె. జ్యోతి తదితరులు పాల్గొన్నారు. – బుట్టాయగూడెం
Comments
Please login to add a commentAdd a comment