ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ఈనెల 17 నుంచి జరిగే ఎస్‌ఎస్‌సీ/ఓఎస్‌ఎస్‌సీ/ ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు అన్ని యాజమాన్య పాఠశాలలు లాగిన్‌లలో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. అలాగే శ్రీమన మిత్ఙ్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా హాల్‌టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు. హాల్‌టికెట్లు ప్రింట్ తీసుకుని విద్యార్థుల వివరాలను హెచ్‌ఎంలు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. వివరాలు సరిపోలకపోతే ఈ మెయిల్ ద్వారా సంచాలకులు ప్రభుత్వ పరీక్షలు, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారి దృష్టికి తీసుకువెళ్లాలని డీఈఓ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment