అర్ధరాత్రి రోడ్డుపై ఆగిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్స
దెందులూరు: మండలంలోని ముప్పవరం సోమవారం అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై నిలిచిపోయింది. వివరాలను ప్రకారం వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే నవదిశా ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు సోమవారం సాయంత్రం వైజాగ్‌లో 35 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అయితే అర్ధరాత్రి వంటి గంట సమయానికి ముప్పవరం వద్ద రిపేర్ వచ్చి ఆగిపోయింది. దీంతో ఆ సంస్థకు ఫోన్ చేయగా యజమాని దుర్భాషడాలరని ప్రయాణికులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న ఏఎస్సై వెంటేశ్వరరావు బస్సు డ్రైవర్‌తో మాట్లాడి, యజమానికి విషయం తెలపడంతో మంగళవారం మీ సొమ్ములు చెల్లిస్తానని యజమాని చెప్పాడు. దీంతో ప్రయాణికులు రాత్రి సమయంలో వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు.
వైభవంగా పెద్దింట్లమ్మ జాతర
కై కలూరు: పంచహారతుల మధ్య కొల్లేటికోట పెద్దింట్లమ్మతల్లి దేదీప్యమానంగా భక్తులకు దర్శినమిచ్చారు. పెద్దింట్లమ్మ జాతర మంగళవారానికి నాలుగో రోజుకు చేరింది. అమ్మవారికి పుష్పాలంకరణ, ధూపసేవ, బాలభోగం వంటి వైదిక కార్యక్రమాలు చేశారు. వస్త్ర, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాదదాతులుగా ఆటపాకకు చెందిన వేగేశ్న ప్రసాదరాజు, గణపవరానికి చెందిన రుద్రరాజు పుల్లంరాజు అందించారు. ఆలయ ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పెరికేగూడెంకు చెందిన శ్యామలాంబ కళానికేతన్ ఆధ్వర్యంలో త్రిరత్నాలు సాంఘిక ప్రదర్శన అహుతులను అలరించింది. ఆలయ ఈఓ కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఈ నెల 13 వరకు జాతర జరుగుతుందని, జలదుర్గాగేకర్ణేశ్వరస్వామి దివ్వ కల్యాణం ఈ నెల 10న నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
రేషన్ బియ్యం పట్టివేత
జంగారెడ్డిగూడెం: అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. రెండు వాహనాల్లోనూ 52 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పోలీసులు, రెవెన్యూ శాఖ సంయుక్తంగా జరిపిన దాడిలో మండలంలోని దేవులపల్లి నుంచి కాకినాడ జిల్లా పిఠాపురానికి ఒక వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 22 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో పిఠాపురం మండలం బి.పత్తిపాడుకు చెందిన కామిరెడ్డి వీరవెంకట్రావును అరెస్టు చేసినట్లు చెప్పారు. అలాగే జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట నుంచి మరొక వాహనంలో యర్రంపేట కు రవాణా అవుతున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో యర్రంపేటకు చెందిన నల్లమోతు సూర్యప్రకాష్‌ను అరెస్టు చేశామన్నారు. ఈ దాడుల్లో ఎస్సై జబీర్‌తోపాటు సివిల్ సప్లయిస్ డీటీ జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
సాంకేతికతను రైతులకు అందించాలి
తాడేపల్లిగూడెం: కృషి విజ్ఞాన కేంద్రాల్లోని వ్యర్థాలను పునర్వియోగ సాంకేతికతను రైతుల దరికి చేర్చాలని ఉద్యానవర్సిటీ ఉపకులపతి డాక్టర్ కె.గోపాల్ కోరారు. వెంకట్రామన్నగూడెంలో మంగళవారం ఉద్యానవర్సిటీలో నిర్వహించిన శాసీ్త్రయ సాంకేతిక సలహామండలి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ రైతుల పొలాల్లో జీవనియంత్రణ కారకాలు లేకుండా ప్రోత్సహించాలన్నారు. సేంద్రియ వ్యవసాయంపై రైతులకు ఆసక్తి పెంచే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 2024–25లో సాధించిన ప్రగతి, 2025–26 సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి చర్చించారు.
అర్ధరాత్రి రోడ్డుపై ఆగిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్స
Comments
Please login to add a commentAdd a comment