12న వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా
ఏలూరు (టూటౌన్): ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.12వేల నగదు, మూడు సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.6లక్షలు ఇఆ్వలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ.రవి అన్నారు. పేదల సమస్యలపై ఈ నెల 12న విజయవాడలో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు. స్థానిక పవరుపేటలోని అన్నే భవన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మహాధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎం.జీవరత్నం, తానా ముత్యాలమ్మ, వై.నాగేంద్రరావు, ఎస్.మహాంకాళిరావు పాల్గొన్నారు.
గాలాయగూడెంలో కోళ్ల మృత్యువాత
దెందులూరు: మండలంలోని గాలయగూడెంలో కోళ్లు మృత్యువాతకు గురవుతున్నాయి. ఒక వైపు అన్ని ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడం పశు వైద్యశాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం విధితమే. చనిపోయిన కోళ్లను గాలాయగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ పక్కన చెరువుగట్టు మీద ఉండటంతో కుక్కలు వచ్చి చనిపోయిన కోళ్లను పీక్కుతింటున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోంది. పశు వైద్య శాఖ సిబ్బంది గ్రామాల్లో పర్యవేక్షణ చేయాలని చనిపోయిన కోళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
కట్నం కోసం వేధిస్తున్నారని భర్తపై భార్య ఫిర్యాదు
ఉండి: వివాహమైన ఆరేళ్ల తరువాత కట్నం కావాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. వివరాల ప్రకారం ఉండి మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన కంకిపాటి లక్ష్మీదుర్గకు, ఏలూరుకు చెందిన శ్రావణ్‌కుమార్‌తో 2019లో వివాహమైంది. ఈ నేపథ్యంలో భార్యను రూ.10 లక్షలు కట్నం తేవాలని వేధించేవాడు. అతనికి అత్తమామలు, ఆడపడుచులు సహకరిస్తూ శారీరక, మానసిక వేధింపులు చేసేవారు. గతేడాది డిసెంబర్ 12న లక్ష్మీదుర్గను ఇంటి నుంచి పంపేయడంతో చెరుకువాడలో తల్లిదండ్రులతో ఉంటుంది. ఈ మేరకు బాధితురాలు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
12న వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా
Comments
Please login to add a commentAdd a comment