ట్రిపుల్ ఐటీలో క్లే, పెన్సిల్ ఆర్ట్ పోటీలు
నూజివీడు: స్థానిక ట్రిపుల్‌ఐటీలో మంగళవారం విద్యార్థులకు మట్టితో ప్రతిమలు తయారు చేయడం (క్లే ఆర్ట్), పెన్సిల్ ఆర్ట్ పోటీలను నిర్వహించారు. త్వరలో నిర్వహించనున్న వార్షికోత్సవం శ్రీసిగ్నస్‌శ్రీలో భాగంగా ఈ పోటీలను నిర్వహించారు. విద్యార్థుల సృజనాత్మకతను మెరుగుపరిచే ఉద్దేశంతో నిర్వహిస్తున్నట్లు ఈ పోటీలను ప్రారంభించిన ఆర్జీయూకెటి రిజిస్ట్రార్, నూజివీడు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కేవీడీజీ బాలాజీ అన్నారు. విద్యార్థుల్లోని కళాపోషణని బయటకి తీస్తూ, మన సంస్కృతిని తెలియజేయడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. క్లే ఆర్ట్ పోటీలో విద్యార్థులు రూపొందించిన ప్రతి ప్రతిమ వెనుక ఒక కథను చెప్పేలా వారి కళాత్మకతను ప్రదర్శించారు. అలాగే పెన్సిల్ ఆర్ట్ పోటీల ద్వారా విద్యార్థులు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా అద్భుతమైన చిత్రాలను చిత్రీకరించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీ ఏఓలు బి.లక్ష్మణరావు, సతీష్, సిగ్నస్ కన్వీనర్ జె.సీతాపతి తదితరులు పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటీలో పలు వర్క్‌షాపులు
నూజివీడు: ట్రిపుల్‌ఐటీలో మంగళవారం పలు వర్క్‌షాపులు నిర్వహించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్ తయారీపైన, పియూసీ విద్యార్థులకు క్రియేటివ్ డిజైన్ మాస్టరీ వర్క్‌షాపులను నిర్వహించారు. టెక్‌జైట్–2025లో భాగంగా ఈ వర్క్‌షాపులను నిర్వహించామని నూజివీడు ట్రిపుల్‌ఐటీ ఏఓ బీ లక్ష్మణరావు పేర్కొన్నారు. పీయూసీ విద్యార్థులకు క్రియేటివ్ డిజైన్‌లో నిర్వహించిన వర్క్‌షాపులో సీనియర్ ప్రొడక్ట్ అండ్ గ్రాఫిక్ డిజైనర్ చోడిశెట్టి సూర్యత్రినాధ్ పాల్గొని డిజైన్ రంగంలో ఉన్న అవకాశాలు, మెరుగైన డిజైనింగ్ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవడం, మార్కెట్‌లో ఉన్న డిమాండ్ తదితర అంశాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment