మహారాష్ట్ర డైట్ బృందం పర్యటన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా డైట్ కాలేజీ లెక్చరర్‌లు ఏలూరు జిల్లాలో అధికారిక పర్యటనకు విచ్చేశారు. మంగళవారం ఉదయం స్థానిక సుబ్బమ్మ దేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో టీచర్లతో పలు అంశాలను చర్చించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో కొత్త విధానాలు, బోధనా పద్ధతులు, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు, ఆధునిక డిజిటల్ పరికరాలు పరిశీలించారు. కొన్ని కార్యక్రమాలను మహారాష్ట్రలో కొన్ని జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించే దిశగా ఏలూరు జిల్లాలో పర్యటించినట్లు ఆ బృందం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మను, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే. పంకజ్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment