ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థి దారుణంగా ఓడిపోవడంతో కూటమి నాయకులు జీర్ణించుకోలేక విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ముస్తఫా అలీ, రవికుమార్ రుద్రాక్షి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు యూటీఎఫ్‌కు వైఎస్సార్‌సీపీ ముసుగువేస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వాస్తవానికి ఏపీటీఎఫ్, పీఆర్‌టీయూ అభ్యర్థులకు కూటమి ముసుగు వేయడం ద్వారా అధికార పక్షమే ఉపాధ్యాయ ఉద్యమంలో చీలికలు తెచ్చిందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ స్వతంత్రంగా పోటీ చేసిందని దానికి యూటీఎఫ్, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయని గుర్తు చేశారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఏ రాజకీయ పక్షం వహించకుండా మండలిలో స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై గళం ఎత్తుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment