
ఒప్పందాలు అమలు చేయాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): హెచ్‌ఆర్ పాలసీ అమలు కోసం కమిటీని ఏర్పాటు చేయాలని, మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, ఇతర సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్థానిక సమగ్ర శిక్ష జిల్లా కార్యలయం వద్ద సమగ్రశిక్ష కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ గతంలో తమ సమస్యలపై సమ్మె చేయగా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని.. అమలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉందన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 5, 6 తేదీల్లో మండల కేంద్రంలో, కేజీబీవీ స్కూల్స్ వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో సామూహిక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 8న జిల్లా కేంద్రంలో మహిళా ఉద్యోగుల సమస్యలపై సదస్సు నిర్వహించి, తీర్మానం చేయనున్నామన్నారు. మార్చి 11న విజయవాడలో నిరసన దీక్ష చేయాలని కమిటీ నిర్ణయించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment