పన్ను వసూళ్లు వేగవంతం చేస్తున్నాం
జంగారెడ్డిగూడెం పట్టణంలో పన్ను వసూళ్లు వేగవంతం చేస్తున్నాం. ఇప్పటికే మైక్‌ల ద్వారా, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా పన్ను చెల్లించేలా చైతన్య పరుస్తున్నాం. రూ.11.34 కోట్లకు గాను ఇంతవరకు రూ.5.38 కోట్లు వసూలైంది. మార్చి నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేసేలా చర్యలు చేపట్టాం. మొండి బకాయిలపై ప్రత్యేక చర్యలు చేపట్టి వసూలు చేసేందుకు కృషిచేస్తున్నాం. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పన్ను వసూళ్లల్లో జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీని ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటున్నాం.
– కేవీ రమణ, కమిషనర్, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ
Comments
Please login to add a commentAdd a comment