కేసుల పరిష్కారానికి సహకరించాలి
ఏలూరు(టూటౌన్): కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు సహకరించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమడోలు, చింతలపూడి కోర్టుల పరిధిలోని పోలీసు అధికారులతో 8న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ యోగ్యమైన క్రిమినల్ కేసుల పరిష్కారం నిమిత్తం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి పోలీసులు కక్షిదారులతో సంప్రదింపులు జరపాలని, రాజీకి అనుకూలమైన కేసులను ఇప్పటికే గుర్తించామని, ఆ కేసులలో కక్షిదారులకు అవగాహన కలిగించి రాజీకి ప్రయత్నించాలన్నారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్న పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ చేస్తారని చెప్పారు. న్యాయ సలహాలు లేదా సాయం కావాల్సిన వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను 15100 లేదా 08812 224555 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment