కదం తొక్కిన కోకో రైతులు
ఏలూరు (టూటౌన్) : కంపెనీలు సిండికేట్‌గా మారి కోకో గింజల ధర తగ్గిస్తున్నాయంటూ ఏలూరులో రైతులు కదం తొక్కారు. చలో ఏలూరు కార్యక్రమంలో భాగంగా రైతులు ర్యాలీ, మహాధర్నా చేపట్టారు. ముందుగా ఫైర్‌స్టేషన్ మీదుగా ఉద్యాన శాఖ డీడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాను ఉద్దేశించి ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కిలోకు రూ.900 ధర ఇప్పించాలని, సిండికేట్‌గా మారిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కంపెనీలతో రైతుల సమక్షంలో చర్చలు జరపాలని లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నినాదాలు చేస్తుండగా ఏలూరు త్రీటౌన్ సీఐకి రైతు సంఘ నాయకులతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం తగదని నాయకులు విమర్శించారు. వినతిపత్రం అందుకున్న కలెక్టర్ వెట్రిసెల్వి రైతులతో చర్చలు జరిపి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ఏపీ కోకో రైతు సంఘం నాయకులు బొల్లు రామకృష్ణ, ఎస్.గోపాలకృష్ణ, సంఘ నాయకులు ఏలూరుతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఎన్టీ ఆర్, కృష్ణా జిల్లాల రైతులు భారీగా తరలివచ్చారు.
కలెక్టరేట్ వద్ద రైతుల మహాధర్నా
కోకో గింజలకు కిలోకు రూ.900 ధర ఇప్పించాలని వినతి
సిండికేట్‌గా మారిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment