క్రికెట్‌లో మెలకువలు నేర్పుతూ..
ఏలూరు రూరల్: ఒకప్పుడు గల్లీ క్రికెట్ ఆడిన యువతి.. నేడు ఆంధ్ర క్రికెట్ మహిళా జట్టుకు కోచ్ అయ్యారు. గ్రామీణ బాలికలను క్రికెటర్లుగా తీర్చిదిద్దుతూ క్రికెట్‌కు సేవలందిస్తున్నారు భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన సంపాద రమాదేవి. జిల్లా బాలికల క్రికెట్ జట్టు విజయాల్లో ప్రధాన భూమికి పోషిస్తున్నారు. ఆమె వద్ద శిక్షణ పొందిన బాలికలు జిల్లా, జోన్, రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపడంతో పాటు రాష్ట్ర జట్టులో సైతం చోటు సంపాదించారు. 2017లో అండర్–19 ఆల్ ఇండియా చాంపియన్‌షిప్ పోటీల్లో ఆంధ్ర జట్టును విజయపథంలో నడపటంలో కీలకంగా వ్యవహరించారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర మహిళల టీ–20 జట్టు కోచ్‌గా నియమితులమైన ఆమె ఏసీఏ లెవెల్–1 ఏగ్రేడ్, ఎన్‌సీఏ లెవెన్–1లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment