ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి యూనిట్‌లోని కోర్టు కాంప్లెక్స్‌ల హౌస్ కీపింగ్ సర్వీస్ (క్లీనింగ్) కోసం వార్షిక నిర్వహణ కాంట్రాక్టును రెండేళ్ల కాలానికి ఇవ్వడానికి సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యా యమూర్తి (ఎఫ్‌ఏసీ) ఎం. సునీల్‌కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఏలూరులోని కోర్టు కాంప్లెక్స్‌లకు ఇద్దరు సూపర్‌వైజర్లు, 54 మంది హౌస్‌మెన్ /హౌస్‌మెయిడ్‌లు అవసరమని, వీరిలో నలుగురికి ప్లంబింగ్, వడ్రంగి, విద్యుత్ పనుల్లో పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. టెండర్ దరఖాస్తులను ఈనెల 17న సాయంత్రం 5 గంటలలోపు పంపాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment