ఏలూరు (టూటౌన్): డీఎస్సీ–2025 పరీక్షలకు టెట్‌లో అర్హత సాధించిన బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని, ఈనెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారి ఆర్‌వీ నాగరాణి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు విద్యార్హత, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్టు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా నేరుగా ఏలూరులోని బీసీ సంక్షేమ అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 86861 80018లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment