అపరాల కొనుగోలుకు చర్యలు
ఏలూరు(మెట్రో): జిల్లాలో ప్రభుత్వ మ ద్దతు ధరలతో మిను ము, పెసల అపరాల కొనుగోలును ప్రారంభిస్తున్నట్టు జేసీ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక జేసీ చాంబర్‌లో ఆమె సమీక్షించారు. క్వింటాకు పెసలు రూ.8,682, మిను ము రూ.7,400లకు కొనుగోలు చేయాలన్నా రు. పెదపాడు, ఏలూరు, దెందులూరు, ముదినేపల్లి, మండవల్లి, కై కలూరు, కలిదిండి మండలాల్లో ఈ–పంట నమోదు చేసుకున్న రైతుల నుంచి వీటిని కొనుగోలు చేయాలన్నారు.
ఇంటర్ పరీక్షలకు 400 మంది గైర్హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన గణితం–2ఏ, బోటనీ–2, సివిక్స్–2 పరీక్షలకు జిల్లాలో 400 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని 55 కేంద్రాల్లో 14,616 మందికి 14,216 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 12,797 మంది జనరల్ విద్యార్థులకు 12,522 మంది, 1,819 మంది ఒకేషనల్ విద్యార్థులకు 1,694 మంది హాజరయ్యారని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు.
ఓపెన్ పరీక్షలకు..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ఆధ్వర్యంలో దూర విద్యా విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షలకు 689 మంది హాజరయ్యారు. రసాయన శాస్త్రం పరీక్షకు 309 మందికి 257 మంది, ఆర్థిక శాస్త్రం పరీక్షకు 480 మందికి 432 మంది హాజరయ్యారని డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
నేటి నుంచి పీ–4 సర్వే
ఏలూరు(మెట్రో): జిల్లాలో శనివారం నుంచి చేపట్టనున్న పీ–4 సర్వేను విజయవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పీ–4 సర్వే, ఎంఎస్‌ఎంఈ సర్వే, వర్క్ ఫ్రమ్ హోం సర్వేపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, మండల సచివాలయ ప్రతినిధులతో ఆమెసమావేశం నిర్వహించారు. పీ–4 సర్వే నిర్వహణపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మా ట్లాడుతూ గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది ద్వారా ఈనెల 16 నాటికి సర్వే పూర్తిచేయాలని, ఈనెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించాలని అన్నారు.
మహిళా దినోత్సవానికి ఆహ్వానం
దెందులూరు: అమరావతిలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలకు అంతర్జాతీయ స్కేటర్, ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డు గ్రహీత ఎం.జెస్సీరాజ్‌కు ఆహ్వా నం అందింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో 9 మందిని ఎంపిక చేయగా వారిలో జెస్సీరాజ్ ఒకరు. శనివారం జరిగే వేడుకలకు తాను హాజరవుతున్నట్టు జెస్సీరాజ్ తెలిపారు.
టైలరింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (టూటౌన్): జిల్లాలో బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల్లోని 18 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇచ్చి అనంతరం సర్టిఫికెట్‌తో కుట్టుమెషీన్ కూడా అందిస్తామని జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం కార్య నిర్వాహక సంచాలకులు ఎన్.పుష్పలత శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అర్హులు సచివాలయాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. శనివారం నుంచి దరఖాస్తుల నమోదుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో 4,589 మందికి శిక్షణ ఇచ్చేలా నిర్దేశించారన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 08812–230837 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
నేడు జాతీయ లోక్ అదాలత్
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్‌ఏసీ) ఎం.సునీల్‌కుమార్ ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాసదన్‌లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ముందుగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
అపరాల కొనుగోలుకు చర్యలు
Comments
Please login to add a commentAdd a comment