ఆమే స్ఫూర్తి.. దీప్తి
రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ..
సాక్షి, భీమవరం: రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా స్వచ్ఛంద రక్తదానంలో ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వాముల్ని చేశారు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో శిబిరాల నిర్వహణకు ఆదేశాలిచ్చారు. ఏ నెలలో ఏఏ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు రక్తదానం చేయాలో తెలుపుతూ షెడ్యూల్‌ను విడుదల చేశారు. గత డిసెంబరులో మొదలైన శిబిరాల నిర్వహణ విజయవంతంగా సాగుతోంది. ఇప్పటివరకూ దాదాపు 500 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఓ నెగెటివ్, బీ నెగెటివ్, ఏబీ నెగెటివ్ తదితర అరుదైన గ్రూప్స్ రక్తం అందుబాటులో ఉందని జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ డా.ఎం.శివరామభద్రిరాజు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందిస్తున్నామన్నారు.
వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటుతూ..
ఏలూరు రూరల్: ఆమెకు పేదరికం సవాల్ విసిరింది. ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే సంకల్పాన్ని ఇచ్చింది. పట్టుదలతో సాధన ఖ్యాతి గడించాలని ఉసిగొల్పింది. ఫలితంగా రాష్ట్ర, జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించిపెట్టింది. ఏలూరుకు చెందని మొగలి దీపానయోమీ పాఠశాల స్థాయి నుంచి వె యిట్ లిఫ్టింగ్‌లో సాధన చేస్తోంది. పేదరికపు అడ్డంకులను దాటి వెయిట్ లిఫ్టింగ్‌లో పట్టు సాధించింది. ఐదేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటింది. 2026లో జరిగే ఒలింపిక్స్ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉత్తమ క్రీడాకారుల క్యాంపునకు ఎంపికైంది. ఔరంగాబాద్‌లో నెలరోజుల పాటు శిక్షణ తీసుకుని గెలుపే లక్ష్యంగా సాధన చేస్తోంది.
ఆమే స్ఫూర్తి.. దీప్తి
ఆమే స్ఫూర్తి.. దీప్తి
Comments
Please login to add a commentAdd a comment