
విద్యతో రాణించాలి
ప్రతి ఒక్క మహిళకూ వారి అమ్మే రోల్‌మోడల్. అలాగే నాకు మా అమ్మ లత ఇచ్చిన ప్రోత్సాహం మరువలేను. అమ్మ 8వ తరగతి వరకూ చదువుకున్నా నన్ను చదివించడంలో కీలక పాత్ర పోషించారు. కలెక్టర్ కావాలనే నా కోరికను నెరవేర్చుకోవడంలో ప్రధాన భూమిక పోషించారు. ప్రస్తుత సమాజంలో ప్రతి మహిళా విద్య, ఆర్థిక వనరులను ఆయుధాలుగా మార్చుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో మహిళలందరికీ శుభాకాంక్షలు.
– కె.వెట్రిసెల్వి, కలెక్టర్, ఏలూరు
సీ్త్ర వ్యక్తి కాదు శక్తి
మహిళ కేవలం వ్యక్తి మాత్రమే కాదు. శక్తిగా అవతరిస్తూ నేడు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంటున్నారు. నన్ను కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి విధి నిర్వహణలో ప్రోత్సహిస్తుంటే.. మా అమ్మ కనకదుర్గ బాధ్యత మరువలేనిది. ఆమె ఇప్పటికీ నాకు అన్నివిధాలా తోడుగా ఉంటూ మనోధైర్యాన్ని నింపుతున్నారు. మా అమ్మే నా రోల్‌మోడల్. డాక్టర్‌గా సేవలందించాలనుకున్నా, అయితే రైతులకు సేవలు అందించడం ఆనందంగా ఉంది.
– వి.శ్రీలక్ష్మి, జిల్లా పౌరసరఫరాల మేనేజర్, ఏలూరు
చాలెంజ్‌గా తీసుకోవాలి
మహిళలు సవాళ్లను చాలెంజ్‌గా తీసుకోవాలి. జిల్లాస్థాయి ఉద్యోగంలో చేరేంత వరకూ ఎంతో నేర్చుకున్నాను. ఇప్పటికీ నేర్చుకుంటున్నాను. తల్లిదండ్రుల సహకారం, భర్త ప్రో త్సాహంతో బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల సహకారంతో జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖను ముందుకు తీసుకు వెళుతున్నాను. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
– పి.శారద, మహిళా శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్, ఏలూరు
●

విద్యతో రాణించాలి

విద్యతో రాణించాలి
Comments
Please login to add a commentAdd a comment