ఉత్సాహంగా 2కే మారథాన్
ఏలూరు (టూటౌన్): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఏలూరులో 2కే మారథాన్ ఉత్సాహంగా జరిగింది. ముందుగా కలెక్టర్ కె.వెట్రిసెల్వి జెండా ఊపి ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి పాత బస్టాండ్ వరకు మారథాన్ నిర్వహించగా జిల్లా అధికారులు, ఉద్యోగులు, మహిళలు, బాలికలు, క్రీడా కారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా దినోత్సవంలో భాగంగా వారం రోజులుగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. శనివారం సీఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించనున్నామన్నారు. హక్కులు, సమానత్వం, మహిళా సాధికారతపై చైతన్యమే లక్ష్యమన్నారు. సమాజంలోని ప్రతిఒక్కరూ మహిళా అభివృద్ధికి సహకరించాలని, ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల విజయాలు గుర్తించి వారిని సత్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఎస్పీ శ్రావణకుమార్, విద్యుత్ ఎస్‌ఈ పి. సాల్మన్‌రాజు, సెట్‌వెల్ సీఈఓ ప్రభాకరరావు, ఐసీడీఎస్ పీడీ పి.శారద, డీసీపీఓ సూర్యచక్రవేణి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరు వి.శ్రీలక్ష్మి, డీఈఓ వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment