యశ్వంత్ మృతిపై సమగ్ర విచారణ జరపాలి
ఏలూరు (టూటౌన్): ఏలూరులోని తంగెళ్లమూడిలో రెల్లి బాలుడు బంగారు యశ్వంత్‌కుమార్‌ను మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసి చిత్రహింసలకు గురి చేయడంతోనే మృతిచెందాడని, ఇది ముమ్మాటికీ పోలీసులు చేసిన హత్య అని దీనిపై సమగ్ర విచారణ జరపాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. శుక్రవారం యశ్వంత్ తల్లి, కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. పోలీసుల లాఠీ దెబ్బలకు చనిపోయిన తర్వాత బాలుడిని కాలువలో పడేసి కట్టుకథలు అల్లుతున్నారన్నారు. హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు జరుగుతుంటే హాం మంత్రికి పట్టదా అని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసల ఆరోపణలపై నిజాలు నిగ్గుతేల్చాలన్నారు. ఏలూరు జిల్లా కార్యదర్శి అందెగుల ఫ్రాన్సిస్, నాయకులు మంచెల్ల ఇస్సాక్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment