మహిళా జడ్జిలకు సత్కారం
ఏలూరు (టూటౌన్): మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని హైకోర్టు జడ్జి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మఽథరావు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాసదన్ లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తల్లిగా, భార్యగా కుటుంబ అభివృద్ధికి సమర్థవంతంగా కృషి చేస్తున్నారన్నారు. రెండో అదనపు జిల్లా జడ్జి పి.మంగకుమారి, ఐదో అదనపు జిల్లా జడ్జి జి.రాజేశ్వరి, పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి ఉమా సునంద, ఏలూరు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి.రచన, పాలకొల్లు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి లక్ష్మీ లావణ్యకు పూలమొక్కలు అందించి, శాలువాలతో సత్కరించారు.
ఇంటర్ పరీక్షలకు 16,025 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు శనివారం నిర్వహించిన గణితం–1బీ, జువాలజీ–1, హిస్టరీ–1 పరీక్షలకు జిల్లా లో 16,025 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా 55 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. 14,407 మంది జనరల్ విద్యార్థులకు 13,847 మంది, 2,590 మంది ఒకేషనల్ విద్యార్థులకు 2,178 మంది హాజరయ్యారు. 94 శాతం హాజరు నమోదైంది. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment