అపరాల రైతుల నిరసన
ఏలూరు (టూటౌన్): అపరాలకు కనీస మద్ద తు ధర రాక నష్టపోతున్నామంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ మండలం జాలిపూడిలో రైతులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. అపరాల కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలంటూ నినాదాలు చేశారు. రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మా ట్లాడుతూ పెసర, మినుములు వంటి అపరాల పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా రా వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించి వేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు పెసర క్వింటాల్‌కు రూ.8,682, మినుముకు రూ.7,400 రావడం లేదన్నారు. ఈ ఏడాది తెగుళ్లతో దిగుబడులు తగ్గాయని, వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సుబ్బారాయుడి ఆలయానికి తాకిడి
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్‌లోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. పుట్టలో పాలు పోసి స్వామిని దర్శించుకున్నారు. పాల పొంగళ్లశాల వద్ద మహిళలు నైవేద్యాలు సమర్పించారు. నాగబంధాల వద్ద, గోకులంలో మహిళలు పూజలు చేశారు. ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నేటి నుంచి వేణుగోపాలస్వామి కల్యాణోత్సవాలు
ముదినేపల్లి రూరల్: మండలంలోని గురజలో రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక కల్యాణోత్సవాలు సోమవారం నుంచి నిర్వహించనున్నట్టు ఈఓ శింగనపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 14 వరకు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. తొలిరోజు అంకురారోపణ, ధ్వజారోహణం, మంగళవారం ఊరేగింపు, 12న కల్యాణోత్సవం, 13న గరుడోత్సవం, రథోత్సవం, 14న పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.
మెకానిక్‌లు వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి
నూజివీడు: నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏలూరు జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షుడిగా యర్రంశెట్టి చిన్ని నియమితులయ్యారు. నూజివీడులో ఆదివారం నిర్వహించిన సమావేశంలో సంఘ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సుభానీ చిన్ని నియమకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సంఘం బలపడితే హక్కులు సాధించవచ్చన్నారు. మెకానిక్‌లు వృత్తిలో నైపుణ్యం పెంచుకోవాలని, ఈ దిశగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. గుండె ఆపరేషన్ చేయించుకున్న మెకానిక్ బసవయ్య, ప్రమాదానికి గురైన సుబ్బారాయుడుకు సంఘం తరఫున రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు. జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ సైదులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొప్పుల శౌరి, 20 మండలాల అధ్యక్షులు, సంఘ నాయకులు పాల్గొన్నారు.
కౌలు రైతులకు
గుర్తింపు కార్డులివ్వాలి
చింతలపూడి: ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న కౌ లు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇ వ్వా లని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఎర్రగుంటపల్లిలో కుప్పా ల సురేష్ అధ్యక్షతన జరిగిన కౌలు రైతుల స మావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్ పామ్ సాగులో 90 శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, వీరికి అన్నదాత సుఖీభవ పథకం, రూ.2 లక్షల వరకు పంట రుణాలు ఇప్పించాలన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ, జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సోమశేఖర్ పాల్గొన్నారు. అనంతరం గ్రామ కమిటీ కన్వీనర్‌గా కుప్పాల సురేష్, కో–కన్వీనర్‌గా పాకనాటి సూరిబాబును ఎన్నుకున్నారు.
అపరాల రైతుల నిరసన
అపరాల రైతుల నిరసన
Comments
Please login to add a commentAdd a comment