లోక్‌అదాలత్‌లో 5,236 కేసుల పరిష్కారం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీల్‌కుమార్
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ఏలూరు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 5,236 కేసులను పరిష్కరించినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్‌ఏసీ) ఎం.సునీల్‌కుమార్ ఆదివారం తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 26 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో ఏలూ రులో 6, భీమవరంలో 3, కొవ్వూరులో 3, నరసాపురంలో 3, తణుకులో 3, తాడేపల్లిగూడెంలో 3, పాలకొల్లులో 1, నిడదవోలులో 1, జంగారెడ్డిగూడెంలో 1, చింతలపూడిలో 1, భీమడోలులో 1 చొప్పున బెంచీలు ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తంగా 4,919 క్రిమినల్ కేసులు, 162 మోటార్ వాహన ప్రమాద బీమా కేసుల్లో సుమారు రూ.11 కోట్లను పరిహారంగా కక్షిదారులకు అందించామన్నారు. 155 సివిల్ కేసులను రాజీ చేయడంతో పాటు 132 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించామన్నారు. ఏలూరులో 1,268, భీమవరంలో 896, చింతలపూడిలో 184, జంగారెడ్డిగూడెంలో 371, కొవ్వూరులో 300, నరసాపురంలో 292, పాలకొల్లులో 176, తాడేపల్లిగూడెంలో 495, తణుకులో 743, నిడదవోలు 465, భీమడోలులో 46 కేసులు పరిష్కరించామని వివరించారు. కేసుల పరిష్కారంలో సహకరించిన న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు, బీమా, బ్యాంకు అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment