ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రానికి వెళ్లే మార్గం పూల సోయగం. రంగులు అద్దినట్టు పూస్తున్న కాగితం పూలతో రహదారి మద్యలోని డివైడర్ భక్తులకు, ప్రయాణికులకు కనువిందు చేస్తోంది. ద్వారకాతిరుమల నుంచి లక్ష్మీపురం వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర, రహదారి మధ్య డివైడర్‌లో శ్రీవారి దేవస్థానం ఈ పూల మొక్కలు వేసి, సంరక్షిస్తోంది. సిబ్బంది నిత్యం మొక్కలను సమాంతరంగా కట్ చేసి, నీరు పెడుతున్నారు. వాటి పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. డివైడర్ కొంత దూరం తెలుపు పూలు, మరి కొంత దూరం ఎరుపు, గులాబీ రంగు పూలతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. భీమడోలు వైపు నుంచి వచ్చే భక్తులకు ఈ పూల మొక్కలు కనిపించగానే క్షేత్రానికి వచ్చామన్న అనుభూతి కలుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment