గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చేతల్లిగా వరాలిచ్చే అమ్మగా పేరుపొందడంతో మంగమ్మగుడికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతీ వారం పెరుగుతూనే ఉంది.
క్షేత్రంలో కోతులను ఎత్తుకెళ్లిన వ్యక్తులు
ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రంలో గుర్తు తెలియని ఒక వ్యక్తి, మహిళ కలిసి ఆదివారం రెండు కోతుల్ని బంధించారు. స్థానికులు ప్రశ్నించడంతో వాటిని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం పాత కేశఖండనశాల వెనుక రోడ్డులో ఆటోలో బోనును ఏర్పాటు చేసి, అరటి పండ్లను ఎరగా వేసి రెండు కోతుల్ని బంధించారు. మిగిలిన వాటిని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. స్థానికులు వారిని ఎవరని నిలదీయడంతో హడావుడిగా అక్కడి నుంచి పరారయ్యారు. అసలు కొండముచ్చులను వారు ఎందుకు పట్టుకెళుతున్నారన్నది తెలియలేదు. కోతుల్ని తామేమి పట్టించలేదని దేవస్థానం, అటవీశాఖ అధికారులు తెలిపారు.
16 టన్నుల ఐరన్ మాయం
దెందులూరు: దెందులూరు హౌసింగ్ గోడౌన్‌లో 16 టన్నుల ఐరన్ మాయమైందని గృహ నిర్మాణ శాఖ డివిజనల్ ఇంజనీర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొవ్వలి వంతెనకు వెళ్లే దారిలో గృహ నిర్మాణ శాఖ గోడౌన్ ఉంది. అయితే అక్కడ ఉన్న 16 టన్నుల ఐరన్ మాయమైందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment