జాతర వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి వనిత
ద్వారకాతిరుమల: భీమడోలులో ఆదివారం జరిగిన జాతర ముగింపు వేడుకల్లో మాజీ హోం మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ద్వారకాతిరుమల మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, గోపాలపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాకారపు బంగారమ్మతో కలసి పసుపులేటి సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వనితకు పెద్దిరెడ్డివారి మహిళలు పసుపు, కుంకుమ పెట్టారు. అనంతరం విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, పాకలపాటి త్యాగ భీమేశ్వరరావు, దాసరి రాంబాబు, భోగరాజు సాయికృష్ణ, పెద్దిరెడ్డి నాగేశ్వరరావు, కొల్లి సుబ్బారావు, ఘంటా శ్రీను, దాకారపు అగ్గియ్య తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment