పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
భీమవరం: భీమవరం లూథరన్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు 1976–1981 మధ్య చదివిన ఆలనాటి మిత్రుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. అప్పటి ఉపాధ్యాయులను, ప్రస్తుత ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. తరగతి గదుల్లో కూర్చుని చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి స్నేహితులు ముగ్గురికి ఆర్థిక సాయం అందించి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఆనాటి స్నేహితుల్లో ఒకరైన శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పాల్గొని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసి అందర్నీ ఆత్మీయంగా పలకరించి సందడి చేశారు. ఆత్మీయ మిత్రుల సమ్మేళనానికి కృషి చేసిన కొప్పర్తి అప్పారావు, బుడెం శ్రీనివాసరావు, కాటం రమేష్, తటవర్తి విశ్వేశ్వరరావు, అడబాల శివను తోటి మిత్రులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment