రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో ప్రతిభ
జంగారెడ్డిగూడెం: జెట్టి సత్యారావు రాష్ట్ర స్థాయి ఫస్ట్ మెమోరియల్ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ 2025 జంగారెడ్డిగూడెంలో ఆదివారం జరిగింది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 220 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్–7, 9, 11, 13, 15 కేటగిరీల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో ఫస్ట్‌ప్రైజ్ రూ.5 వేలు, సెకండ్‌ప్రైజ్ రూ.4 వేలు, థర్డ్ రూ.3 వేలు అందజేశారు. 20 స్థానాలకు క్యాష్ ప్రైజ్, ట్రోఫీలు అందజేశారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారులకు ఉచిత భోజన వసతి కల్పించారు. స్థానిక ప్రతిభ ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు చేతుల మీదుగా విజేతలు ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి దేవరపల్లి లక్ష్మణరావు(ఏలూరు), ద్వితీయ బహుమతి జడల మల్లేశ్వరరావు(విజయవాడ), తృతీయ బహుమతి కొరపర్తి సీతసాగర్ (రాజమండ్రి)కు అందజేశారు. కార్యక్రమంలో జెట్టి సత్యాదిత్య, కాసర సరోజారెడ్డి, కాల్నీడి రమేష్, ముప్పిడి శ్రీనివాసరావు, సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment