సర్కారుమోసంపై యువతపోరు
8లో
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైద్య విద్యకు గ్రహణం పట్టించారు.. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, వేల సంఖ్యలో ఉన్న ఉద్యోగాలు పీకేశారు.. నిరుద్యోగ భృతి హామీని గాలికొదిలేశారు. గత పది నెలల్లో ఉపాధి కల్పన జరగకపోగా ఉన్న ఉపాధికి చంద్రబాబు సర్కారు గండి కొట్టింది. అడుగడుగునా నిరుద్యోగులను, యువతను దగా చేస్తూ ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నారు. పాలకొల్లు మెడికల్ కళాశాల పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఉమ్మడి పశ్చిమలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న ఫీజు రీయిబర్స్‌మెంట్‌ను అటకెక్కించి తల్లిదండ్రులను అప్పులపాలు చేశారు. వీటన్నింటిపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. బుధవారం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టనుంది. యువత పోరుకు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, నిరుద్యోగ యువత, వారి తల్లిదండ్రులు హాజరుకానున్నారు. రెండు జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు, పార్లమెంట్ ఇన్‌చార్జులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు హాజరు కానున్నారు.
దగ్గులూరులో వైద్య కళాశాలకు గ్రహణం
గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఏలూరు నగరంలో, పాలకొల్లులోని దగ్గులూరులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కేంద్రం ద్వారా అనుమతులు మంజూరు చేయించారు. ఏలూరులో రూ.535 కోట్లు, పాలకొల్లులో రూ.475 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో సుమారు 3 లక్షల చదరపు అడగుల విస్తీర్ణంలో కళాశాల భవనం, బాయ్స్, గర్‌ల్స్‌కు వేర్వురుగా 90 వేల చదరపు అడుగుల్లో హాస్టళ్లతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పించేలా ప్రాజెక్టును రెండు జిల్లాలో ప్రారంభించారు. ఏలూరులోని ప్రభుత్వ వైద్యకళాశాలను గతేడాది నుంచి ప్రారంభించారు. 150 సీట్లతో ప్రారంభమైన కళాశాలలో ఈ ఏడాది రెండో బ్యాచ్ ప్రారంభమైంది. ఇక పాలకొల్లులోని దగ్గులూరులో 60 ఎకరాల విస్తీర్ణంలో పనులు మొదలుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ. 80 కోట్ల వ్యయంతో బేస్‌మెంట్, పిల్లర్లు, ఇతర నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేసుకుని వచ్చే విద్యా సంవత్సరానికి పాలకొల్లు వైద్యకళాశాలను ప్రారంభించాలనేది గత ప్రభుత్వ ఆలోచన. కూటమి సర్కారు కొలువుదీరడంతో పనులు నిలిచిపోయాయి. కళాశాల పూర్తయితే ఏటా 150 సీట్ల చొప్పున ఐదేళ్ళల్లో 750 సీట్లు పశ్చిమగోదావరిలో పేద విద్యార్థులకు దక్కే అవకాశం ఉంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం గ్రహణం పట్టించింది.
ఊరిస్తున్న పొగాకు ధరలు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 24 నుంచి పొగాకు వేలం ప్రారంభం కానుంది. గతేడాది కంటే ఎక్కువ ధర వస్తుందని ఆశిస్తున్నారు.
8లో
న్యూస్‌రీల్
నేడు ఏలూరు, భీమవరంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు
నిరుద్యోగ భృతి హామీ గాలికే
21 వేల మంది వలంటీర్లను మోసగించిన ప్రభుత్వం
1,378 మంది మద్యం షాపుల సిబ్బందికి ఉద్వాసన
పాలకొల్లులో వైద్య కళాశాల పనులు నిలిపివేత
ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా, వసతి దీవెన నిధులపై మౌనం
హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నేడు పోరుబాట
Comments
Please login to add a commentAdd a comment