22 వేలకుపైగా ఉద్యోగాల తొలగింపు
నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు వస్తుందని లక్షలాది మంది యువత ఆశపడి భంగపాటుకు గురయ్యారు. ఏలూరు జిల్లాలో 10,589, పశ్చిమగోదావరిజిల్లాలో 9,547 మంది వలంటీర్లను అధికారంలోకి రాగానే తొలగించేశారు. ఎన్నికల ప్రచారంలో లోకేష్ మొదలుకొని బీజేపీ నేతల వరకు అందరూ వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, రూ. 10 వేలు జీతం ఇస్తామని పదే పదే చెప్పి అధికారంలోకి రాగానే వలంటీర్ల కడుపుకొట్టారు. ప్రభుత్వ వైన్‌షాపుల్లో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బందిని కూడా ఒక్క సంతకంతో రోడ్డున పడేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 893 మంది, ఏలూరు జిల్లాలో 485 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. ఫీజు రియంబర్స్‌మెంట్ గత ప్రభుత్వం సమర్ధవంతంగా అమలు చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 2,04,681 మందికి రూ. 485.23 కోట్లు, జగనన్న వసతి దీవెన ద్వారా 1,76,142 మందికి రూ.163.41 కోట్లు అందించారు. ఏలూరు జిల్లాలో 1,46,007 మంది విద్యార్థులకు రూ.383.42 కోట్లు జగనన్న విద్యాదీవెనలో.. 1,42,996 మంది విద్యార్థులకు రూ.142.96 కోట్లు వసతి దీవెన ద్వారా అందచేశారు. ఈ ప్రభుత్వం 10 నెలలు గడిచినా మొదటి సంవత్సర రీయింబర్స్‌మెంట్ ఫీజులు ఇంత వరకు చెల్లించలేదు.
Comments
Please login to add a commentAdd a comment