యువత పోరు జయప్రదం చేద్దాం
కై కలూరు: ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెనలో రూ.4,600 కోట్ల బకాయిలు తక్షణం విడుదల చేయాలని, రూ.3 వేల నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి ప్రధాన డిమాండ్లతో బుధవారం జరిగే యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) కోరారు. కై కలూరు పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద బుధవారం 10 గంటల వినతిపత్రం అందిస్తామన్నారు. నాలుగు మండలాల విద్యార్థులు, తల్లిదండ్రులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ముదిరాజుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్థన్, పార్టీ ఎంపీపీలు చందన ఉమామహేశ్వరరావు, రామిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ బలే నాగరాజు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment