విజువల్లీ చాలెంజ్డ్ ఎంప్లాయీస్ కార్యవర్గం ఎన్నిక
ఏలూరు (టూటౌన్): విజువల్లీ చాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గానికి ఏలూరులోని గిరిజన భవన్‌లో ఎన్నికల అధికారి బురహన్ అలీ మంగళవారం ఎన్నికలు నిర్వహించారు. 24 పోస్టులకు 24 నామినేషన్లు రావడంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించి వారితో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జి. రవీంద్రబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎ.జలంధర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారిగా సీహెచ్.జ్యోతి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా జి.రాధారాణి, రాష్ట్ర సహా అధ్యక్షుడిగా ఎన్.వెంకటేశ్వరరావు, రాష్ట్ర సంఘ సలహాదారుగా కె.గురుప్రసాద్, రాష్ట్ర మహిళా కార్యదర్శిగా పి.శైలజ, ఉపాధ్యక్షులుగా దేవేంద్రనాథ్, మధుబాబు, రామ్మోహన్ రావు, గోపి, శ్రీనివాస్, ఎరుకునాయుడు, భాస్కరరావు, సంయుక్త కార్యదర్శులుగా నాగార్జున, నరేష్, రాము, గోవిందరావు, దుర్గా ప్రసాద్, రాముడు, భార్గవ్, అర్చన, కృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment