వైఎస్ జగన్‌ను కలసిన కౌన్సిలర్లు
నూజివీడు: నూజివీడు మున్సిపాలిటీకి చెందిన చైర్‌పర్సన్ రామిశెట్టి త్రివేణీదుర్గతో పాటు 12 మంది కౌన్సిలర్లు మంగళవారం ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. వీరిని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వెంట పెట్టుకొని తీసుకెళ్లి వైఎస్ జగన్‌తో మాట్లాడించారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు షేక్ మెహరున్నీసా బేగం, తుమ్మూరు మౌనిక, తలారి ధనలక్ష్మి, షేక్ రజియాబేగం, కళ్లేపల్లి ప్రియాంక, గాదెరెడ్డి శ్రీలత, మీర్ అంజాద్‌ఆలీ, చేబత్తిన మణికుమారి, నవుడు నాగమల్లేశ్వరరావు, శీలం రాము, కోఆప్షన్ సభ్యులు రామిశెట్టి మురళీకృష్ణ, మైనారిటీ విభాగం నాయకులు షేక్ యూనస్‌పాషా(గబ్బర్), పిళ్లా చరణ్ తదితరులు కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment