బ్యాంకు ఉద్యోగుల సమ్మె జయప్రదం చేయాలి
ఏలూరు (టూటౌన్) : ఈ నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు సమ్మె చేస్తున్నట్లు ఏలూరు జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మోహన్ తెలిపారు. మార్చి 24 25 తేదీలలో జరిగే సమ్మెలో భాగంగా మంగళవారం సాయంత్రం స్థానిక ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద బ్యాంకు ఉద్యోగులు యుఎఫ్‌బీయు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే నియమించాలని, వారానికి ఐదు రోజులు పని దినాలు కల్పించాలని, తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐబీఈఏ నేత ఎన్,లక్ష్మణరావు, ఏఐ బీఓసి నేత శ్రీనివాస్, ఎన్‌సీబీఇ నేత రత్న విమల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment