చేపల చెరువులు తవ్వేస్తున్నారు
కై కలూరు: వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్పు చేయాలంటే కఠినతర నిబంధనలు ఉన్నాయి. పైగా ఆ గ్రామాలు ఆక్వా జోన్ పరిధిలో ఉండాలి. మండల స్థాయి సిఫార్సులతో జిల్లా అధికారులు చెరువుల తవ్వకాలకు అనుమతులు మంజూరు చేయాలి. ఇవేమి పట్టించుకోకుండా కలిదిండి మండలం ఎస్‌ఆర్‌పీ అగ్రహారంలో 101, 129 సర్వే నంబర్లలో 18 ఎకరాల్లో చేపల చెరువులను తవ్వుతున్నారు. ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ(అప్సడా) నిబంధనలు పాటించడం లేదు. విషయం తెలుసుకున్న మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రవికుమార్ మంగళవారం స్వయంగా వెళ్లి అనుమతుల పత్రాలు చూపించాలని అప్పటి వరకు పనులు నిలుపుదల చేయాలని ఆదేశించారు.
ఆభయారణ్యంలో అలజడి..
కొల్లేరు అభయారణ్యంలో జీవో 120 అమలులో ఉంది. దీని ప్రకారం తట్ట మట్టి తీసినా నేరంగా పరిగణిస్తారు. కూటమి నేతల అండతో కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర పేరుతో పందిరిపల్లిగూడెం వంతెన వద్ద వాహనాలు నిలుపుదల చేయాలంటూ మట్టిని పూడ్చారు. అదే విధంగా గుమ్మళ్ళపాడు, సింగరాలతోట ప్రాంతాల్లో చెరువుల మరమ్మతులు జరుగుతున్నాయి. అవి కొల్లేరు అభయారణ్యంతో సంబంధం లేదని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు ఆదేశాలతో అటవీ అధికారులు చేపల అక్రమ చెరువుల గట్లుకు గండ్లు పెడుతోన్నా.. కొద్ది సమయానికి వాటికి గ్రామస్తులు తడికలు అడ్డుపెడుతున్నారు. కొల్లేరు గ్రామాల్లో అటవీ అధికారులు, గ్రామస్తులకు చేపల అక్రమ చెరువుల విషయంలో వివాదాలు జరుగుతున్నాయి.
ఎన్‌ఆర్‌పీ అగ్రహారంలో చేపల చెరువు అక్రమ తవ్వకం
కొల్లేరు అభయారణ్యంలోనూ నిబంధనలకు తూట్లు
పట్టించుకోని అధికారులు
నోటీసులు అందిస్తాం
చేపల చెరువుకు ముందుగా మండల స్థాయి అధికారుల నుంచి అనుమతులు పొందాలి. తర్వాత జిల్లా అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు. కలిదిండి మండలం ఎస్‌ఆర్‌పీ అగ్రహారంలో తవ్వుతున్న చేపల చెరువుకు ఎటువంటి అనుమతులు లేవు. సదరు రైతుకు నోటీసు అందించాలని ఎఫ్‌డీవోకు అదేశించాం.
– బి.రాజ్‌కుమార్, మత్స్యశాఖఽ అధికారి, కై కలూరు
చేపల చెరువులు తవ్వేస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment