గుబ్బల మంగమ్మ తల్లి జాతర ప్రారంభం
బుట్టాయగూడెం : మండంలోని కామవరం సమీపంలో దట్టమైన అటవీలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మతల్లి జాతర మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గురూజీ వర్సా పుల్లారావు ఆధ్వర్యంలో గణపతి విశేష పూజలు, పాలాభిషేకం పూజా కార్యక్రమాలు ఆదివాసీ సాంస్కృతిక, సంప్రదాయాల ప్రకారం విశేష పూజలు చేశారు. జాతర సందర్భంగా డోలు వాయిద్యాల దరువులతో కొండలు దద్దరిల్లాయి. మరో రెండు రోజులు మంగమ్మతల్లి జాతర మహోత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు ఉత్సవాల్లో స్థానిక నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 4 వేలు మందికి పైగా ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు అమ్మ వారిని దర్శించుకున్నట్లు ఆలయ కమిటి ప్రతినిధి, సర్పంచ్ కోర్స గంగరాజు తెలిపారు.
కాలుజారి కాలువలో పడి మహిళ మృతి
భీమడోలు: మండలంలోని పూళ్ల వద్ద శుక్రవారం తెల్లవారుజామున గోదావరి కాలులో కాలుజారి ప్రమాదవశాత్తు కోడూరుపాడుకు చెందిన మహిళ జోగినీడి లక్ష్మి(59) మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోడూరుపాడుకు చెందిన జోగినీడి లక్ష్మి ప్రతి శుక్రవారం పూళ్లలోని గోదావరి కాలువలో స్నానం చేసి రేవు వద్ద ఉన్న గుళ్లల్లో చేస్తుంది. ఈ క్రమంలో రోజు మాదిరిగానే తెల్లవారుజామున భర్తతో గోదావరి స్నానానికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లింది. అయితే ఉదయం 8 గంటల కూడా ఇంటి రాకపోవడంతో భర్త గోదావరి కాలువ దగ్గరికు వచ్చి చూడగా లక్ష్మీ చెప్పులు కనబడగా స్థానికుల సహాయంతో కాలువలో గాలించగా లక్ష్మీ మృతదేహం బయటపడింది. భర్త వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు.
ఆటో–లారీ ఢీ
ఒకరికి తీవ్రగాయాలు
గణపవరం: మండలంలోని వరదరాజపురం గ్రామ శివారున లారీ ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఆటోడ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. గురువారం రాత్రి పిప్పర వైపు నుంచి వరదరాజపురం వస్తున్న ఖాళీ ఆటోను పిప్పరవైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటో తీవ్రంగా దెబ్బతినగా ఆటో డ్రైవర్ కర్రిశ్రీను తలకు తీవ్రంగా గాయం కావడంతో అతనిని తాడేపల్లిగూడెంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ లారీని అక్కడే వదిలి పరారయ్యాడు. వరదరాజపురం గ్రామానికి చెందిన కర్రి శ్రీను ఇంటికి కూతవేటు దూరంలోనే ఈ ప్రమాదం సంభవించడంతో వెంటనే స్థానికులు వచ్చి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.
గుబ్బల మంగమ్మ తల్లి జాతర ప్రారంభం
గుబ్బల మంగమ్మ తల్లి జాతర ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment