విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
టి.నరసాపురం: విద్యుత్ షాక్‌తో గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందింది. వివరాల ప్రకారం టి.నరసాపురానికి చెందిన కుప్పల లక్ష్మి (35) శుక్రవారం ఓ రైతు పొలంలో కోకో కాయలు కోసేందుకు వెళ్లింది. కోకో కాయలు కోస్తుండగా, సమీపంలోని విద్యుత్ వైరుకు కాయలు కోస్తున్న గెడ తగలడంతో లక్ష్మి విద్యుత్ షాక్‌కు గురైంది. దీంతో లక్ష్మిని చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది.
అక్రమ కలప పట్టివేత
కుక్కునూరు: అక్రమంగా దాచి ఉంచిన ఇరుగుడు చావ (రోజ్ వుడ్) కలపను శుక్రవారం కుక్కునూరు అటవీశాఖాధికారులు పట్టుకున్నారు. కుక్కునూరు అటవీశాఖ రేంజ్ అధికారి కె.కృష్ణకుమారి చెప్పిన వివరాల ప్రకారం మండలంలోని బెస్తగూడెం గ్రామ శివారులో రోజ్ వుడ్ కలపను అక్రమంగా దాచి ఉంచారన్న సమాచారం మేరకు దాడి చేసినట్టు చెప్పారు.ఈ దాడులలో 52 సైజ్‌ల రోజ్ వుడ్‌ను స్వాధీనం చేసుకుని అటవీశాఖ కార్యాలయానికి తరలించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఐరన్ ప్లేట్ పడి కూలీ మృతి
పెంటపాడు: ప్రత్తిపాడులో ఓ పేపర్‌మిల్లులో పని చేస్తూ ప్రమాదవశాత్తూ ఐరన్ ప్లేట్ మీద పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. పెంటపాడు ఎస్సై స్వామి తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెంలోని యాగర్లపల్లికి చెందిన షేక్ మస్తాన్ (38) పట్టణంలో పాత ఇనుము దుకాణంలో పని చేస్తున్నాడు. అయితే ఈనెల 13న పెంటపాడు మండలం ప్రత్తిపాడులోని ఓ పేపర్‌మిల్లులో ఇనుప వస్తువులను తొలగించేందుకు వెళ్లాడు. పని చేస్తున్న క్రమంలో మస్తాన్‌పై బరువైన ఐరన్‌ప్లేట్ పడటంతో దాని కింద పడి మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో విషయం శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎవరీకీ తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న ఎస్సై అక్కడకు చేరుకొని వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment