బతుకుతెరువు కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు
కాళ్ల: బతుకుతెరువు కోసం వెళ్లి ఘోర రోడ్డు ప్రమాదంలో మండలానికి ఇద్దరు వ్యక్తులు మరణించారు. మండలంలోని ప్రాతాళ్ళమెరక గ్రామానికి చెందిన కోటి వెంకట వరప్రసాద్(54) తన బొలెరో వ్యాన్‌లో కిరాయికి రొయ్యలు పిల్లలు తేవడానికి ఆఫ్టింగ్ డ్రైవర్‌గా వెళ్లే జువ్వలపాలెం గ్రామానికి చెందిన చీపురుపల్లి శివకృష్ణ (29) తీసుకుని గురువారం రాత్రి కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతం వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున రొయ్యపిల్లలు వ్యాన్ లో తీసుకుని చల్లపల్లి మీదుగా వస్తుండగా ఘంటసాల మండలం జీలగలగండి గ్రామ పరిధిలో దురదృష్టవశాత్తు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దీంతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. శివకృష్ణకు ఇంకా వివాహం కాలేకపోవడంతో, అందరితో కలిసి తిరిగే మిత్రుడు మరణవార్త తెలియడంతో స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
బతుకుతెరువు కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు
Comments
Please login to add a commentAdd a comment