గుడి వద్ద జనసేన సభ ప్రసార స్క్రీన్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించిన ప్రత్యక్షంగా ప్రసారం చేయడానికి స్థానిక రామచంద్రరావు పేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని వినియోగించుకోవడం సిగ్గు చేటని వైఎస్సార్ సీపీ ఏలూరు నియోజకవర్గ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు శివ రావు ఒక ప్రకటనలో ఖండించారు. జనసేన ఆవిర్భావ సభ ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించిన స్క్రీన్‌ను వేంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసి భక్తుల మనోభావాలను తుంగలో తొక్కారని, ప్రశాంతంగా దేవుని దర్శనానికి వచ్చే భక్తులకు మానసిక ప్రశాంతతను దూరం చేయడం ఏ మేరకు సబబన్నారు. కాగా ఈ విషయాన్ని పలు హిందూ సంఘాల నాయకులు సైతం ఖండించారు. బడి దగ్గర మద్యం, గుడి దగ్గర రాజకీయాలు చేయడం ఒక్క కూటమి నాయకులకే చెల్లిందన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తే ప్రజలే తరిమికొట్టే పరిస్థితి ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment