జలాశయంలో దూకి మహిళ ఆత్మహత్య
బుట్టాయగూడెం: భర్తతో గొడవ జరగడంతో మనస్థాపం చెందిన భార్య జలాశయంలోకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం మండలంలోని చింతలగూడెంలోని పొగొండ రిజర్వాయర్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఇనూమూరుకు చెందిన తేజస్విని ఇదే మండలం సీతప్పగూడేనికి చెందిన రవితేజ ఇద్దరూ సంవత్సరం పాటు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల వీరిద్దరూ తరచూ గొడవపడుతున్నారు. అయితే గురువారం కూడా భార్యభర్తలిద్దరూ గొడవపడ్డారు. తీవ్ర మనస్థాపం చెందిన తేజస్విని గురువారం సాయంత్రం సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే శుక్రవారం ఉదయం తేజస్విని మృతదేహం పోగొండ రిజర్వాయర్‌లో పైకి తేలి ఉన్నట్లు తెలుసుకున్న తేజస్విని తరఫు బంధువులు లబోదిబోమంటూ అక్కడకు చేరుకున్నారు. తల్లి బేలం దుర్గమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అక్కడికి వెళ్ళి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా మృతి చెందిన తేజస్విని, రవితేజ దంపతులకు 7 నెలల పాప ఉంది.
జలాశయంలో దూకి మహిళ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment