అభయాంజనేయస్వామి హుండీ లెక్కింపు
పెదపాడు: అభయాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ.12,08,963 వచ్చినట్లు ఆలయ ఈఓ పీ.తారకేశ్వరరావు తెలిపారు. అభయాంజనేయస్వామి హుండీ ఆదాయం లెక్కింపు బుధవారం నిర్వహించారు. 80 రోజులకు జరిగిన లెక్కింపులో ఈ ఆదాయం వచ్చిందని పర్యవేక్షణాధికారి సురేష్ కుమార్ తెలిపారు.
గత సీజన్‌లో డీసీఎంఎస్ అత్యుత్తమ ప్రదర్శన
ఏలూరు(మెట్రో): గత వ్యవసాయ సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో డీసీఎంఎస్ అత్యుత్తమ పనితీరుని కనపర్చిందని, రాబోయే రబీలో కూడా అదే స్పూర్తితో ధాన్యం సేకరణ చేసి రైతులకు మేలు చేయాలని జాయింట్ కలెక్టర్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ పర్సన్ ఇన్‌చార్జ్ పి.ధాత్రిరెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ సర్వజన సభ స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం జేసీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్లలో పటిష్టమైన ప్రణాళికతో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఎంతో సహకరిస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలుపై సిబ్బంది మరింత శిక్షణ అందించాలన్నారు. జిల్లా సహకార అధికారి ఏ.శ్రీనివాస్ మాట్లాడుతూ ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ డే సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
విద్యాసంస్థల బస్సులపై కేసుల నమోదు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు బుధవారం విద్యా సంస్థల బస్సుల తనిఖీలు నిర్వహించి 8 కేసులు నమోదు చేసినట్టు ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ తెలిపారు. ఫిట్‌నెస్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా తదితర అంశాలను పరిశీలించి ఆయా సర్టిఫికెట్లు లేని, నిబంధనలకు విరుద్ధంగా నడుతుపున్న 8 బస్సులపై కేసులు నమోదు చేసినట్టు వివరించారు.
ఆర్థిక గణనకు జిల్లా స్థాయి కమిటీ
ఏలూరు(మెట్రో): వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా 8వ ఆర్థిక గణన నిర్వహించనున్న నేపథ్యంలో ఆర్థిక గణనను సులభతరం చేయడానికి జిల్లా స్తాయి కమిటీని ఏర్పాటుచేస్తూ కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, మెంబర్ కన్వీనర్‌గా జిల్లా ఎకనామిక్స్ ఆఫీసర్(సీపీవో) వ్యవహరిస్తారు. జిల్లా ఎస్పీ, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పరిశ్రమల అధికారి, డీఐపీఆర్‌ఓ, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డీపీవో, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనరు తదితరులు సభ్యులుగా ఉంటారు.
పోలవరం ప్రాజెక్టు డివిజన్–2 ఈఈగా మూర్తి
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు డివిజన్–2 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఏఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ మూర్తి బాధ్యతలు స్వీకరించారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన మూర్తిని సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. జలవనరుల శాఖలో పదోన్నతులు పోలవరం ప్రాజెక్టు జలవనరుల శాఖ అధికారులకు పదోన్నతులు లభించాయి. పి.వెంకటరమణ డివిజన్–1 ఈఈగా, ఏఎస్‌ఎల్‌ఎస్‌ఎన్ మూర్తి డివిజన్–2 ఈఈగా, డి.శ్రీనివాసరావు డివిజన్–3 ఈఈగా, కె.సుబ్రహ్మణ్యం డివిజన్–4 ఈఈగా, జి.కృష్ణ, డివిజన్–5 ఈఈగా, కె.బాలకృష్ణమూర్తి డివిజన్–6ఈఈగా, డి.దామోదరం డివిజన్–7ఈఈగా, కె.పుల్లారావు డివిజన్–8ఈఈగా పదోన్నతులు పొందినట్లు అధికారులు పేర్కొన్నారు.
అభయాంజనేయస్వామి హుండీ లెక్కింపు
అభయాంజనేయస్వామి హుండీ లెక్కింపు
Comments
Please login to add a commentAdd a comment