పెదపాడు : వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఈనెల 14 నుంచి 16 వరకు జరిగిన 34వ సబ్‌జూనియర్ అంతర్ జిల్లా బాలబాలికల కబడ్డీ పోటీల్లో పెదపాడు మండలం వీరమ్మకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు తృతీయ స్థానం సాధించినట్లు హెచ్‌ఎం రాంప్రసాద్ తెలిపారు. కబడ్డీ పోటీల్లో విద్యార్థులు హర్ష, శాంతరాజు ప్రతిభ చాటారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.
తుది దశకు టెన్నిస్ పోటీలు
భీమవరం: భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న వెర్టెక్స్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. గురువారం నిర్వహించిన పోటీల్లో ఫలితాలివి. 75+ డబుల్స్ విభాగంలో అశోక్‌రెడ్డి–సాయి రాంబాబు, 70+ డబుల్స్ విభాగంలో సన్యాసిరాజు–గజపతి, 65+ డబుల్స్ విభాగంలో ఆనంద స్వరూప్– శ్రీనివాస్ జోడి విజయం సాధించారు. 65+ సింగిల్స్ విభాగంలో వి.శ్రీనివాసరెడ్డి, 70+ సింగిల్స్ విభాగంలో సేతు విజేతలుగా నిలిచారు.